వైసీపీ స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త ఎంత‌… గ‌డప గ‌డ‌ప‌కు హిట్టా.. ఫ‌ట్టా…!

ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్ సూచించిన‌ట్టుగా.. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలు అంద‌రూ ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ప్ర‌తిఇంటినీ ట‌చ్ చేస్తున్నారు. ప్ర‌జ‌ల ను క‌లుస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌బుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా.. మ‌హిళ‌ల‌ను ఉద్దేశించే జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి.. మ‌హిళ‌ల‌ను కేంద్రంగా తీసుకుని.. నాయ‌కులు.. ముందుకు సాగుతున్నారు. మ‌హిళ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.

అయితే.. ఈ క్ర‌మంలో అస‌లు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రుల‌కు ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని.. ప్ర‌జ‌లు వారిని తిప్పికొడుతున్నారని.. దీంతో చాలా మంది నాయ‌కులు ఇంటికే ప‌రిమితం అయ్యార‌ని.. వారు క‌నీసం.. జ‌గ‌న్ మాట‌ను కూడా ల‌క్ష్య పెట్ట‌డం లేద‌ని.. గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఇదంతా నిజ‌మేనా? అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాత్కాలికంగా.. ప్ర‌జ‌ల‌లో ఉండే భావోద్వేగాల‌ను చూసి శాశ్వ‌తం అనుకునే వీల్లేదం టున్నారు.

ఎందుకంటే.. స‌హ‌జంగానే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తిసంక్షేమ ప‌థ‌కం అంద‌రికీ అందాల‌ని లేదు. సో.. అందిన వారు హ్యాపీగా ఉంటారు. అంద‌నివారు.. మాత్రం త‌మ‌కు అంద‌లేద‌నేఆదేద‌న‌తో ఉంటారు. ఇలాంటి వారు ఖ‌చ్చితంగా త‌మ ద‌గ్గ‌ర‌కు వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు త‌మ స‌మ‌స్య‌లు వినిపించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇలా అడిగినంత మాత్రాన ఎమ్మెల్యేల‌ను.. మంత్రుల‌నునిల‌దీసిన‌ట్టు కాదు క‌దా! అంటున్నారు. అలా నిల‌దీయాల‌నేది కూడా ప్ర‌జ‌ల అభిమతం కాదు క‌దా!! అంటున్నారు.

వాస్త‌వానికి మూడేళ్ల పాల‌న త‌ర్వాత‌.. అంతో ఇంతో వ్య‌తిర‌క‌త ఉంటుంది. అదే అంతో ఇంతో ప్ర‌జ‌ల నుంచి క‌నిపిస్తోంది. దీనినే ప్ర‌ముఖంగా చూపించి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించాల్సిన అవ‌స‌రంలేద‌ని.. అంటున్నారు. ఇక‌, ఇలా విమ‌ర్శ‌లు వ‌చ్చిన చోట‌.. మ‌రోసారి అధికార వ‌ర్గాలు వెళ్లి.. నిజ‌మెంత‌? అని ప‌రిశీల‌న చేస్తే.. కేవ‌లం త‌మ‌కు ఎలాంటి ప‌థ‌కం రాలేద‌ని మాత్ర‌మే ప్ర‌శ్నించామం టూ.. ప్ర‌జ‌లు చెబుతున్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. అంత‌కు మించి ఏమీ వ్య‌తిరేక‌త లేద‌ని అంటున్నారు. సో.. దీనిని బ‌ట్టి..ఈ గ‌డ‌ప గ‌డ‌ప కు కార్య‌క్ర‌మం దాదాపు హిట్ట‌యిన‌ట్టేన‌ని అంటున్నారు.

Share post:

Popular