NTR30 చరిత్రలో గుర్తుండిపోవాలే .. సక్సెస్ కోసం రాజమౌళి ప్లాన్ లో వెళ్తున్న కొరటాల..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. నేడు స్టార్స్ గా ఉన్న వారు రేపు జీరోలు అవుతారు..ఈరోజు చిన్న హీరో..రేపు పాన్ ఇండియా స్టార్ అవుతారు..అలా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతుంటాయి. వాటికి అనుగుణంగానే డైరెక్టర్లు, నిర్మాతలు మారిపోతుంటారు. లేదు కాదు నేను కత్తి..నా రూటే సపరేటు అన్నారంటే..ఫ్లాప్ సినిమాలతో ఉన్న పరువు పోగొట్టుకోవాలి.

నిన్న మొన్నటి వరకు కెరీర్ లోనే ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాతో ఫస్ట్ ఫ్లాప్ రుచి చూశాడు. అది కూడా మెగస్టార్ నటించిన సినిమాతో ఫ్లాప్ అందుకోవడం కొంచెం బాధ కలిగించే విషయమే. ఈ సినిమాలో కొరటాల చేసిన ఏకైక తప్పు..చిరంజీవి కోసం తాను రాసుకున్న స్క్రిప్ట్ ను మార్చుకోవడమే. అక్కడే ప్లాన్ బెడిసికొట్టింది. సినిమా దొబ్బేసింది. పాపం ఈ సినిమా విషయంలో కొరటాలను బాగా ట్రోల్ చేసారు. ఇక ఇప్పుడు కొరటాల మనసు మార్చుకున్నాడట.

ఇక పై ఏ హీరో కోసం తను నమ్మిన స్క్రిప్ట్ ను మార్చకూడదు అని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే తారక్ తో తెరకెక్కించే సినిమాకోసం తెగ కష్టపడుతున్నారట కొరటాల. ఈ క్రమంలోనే..ఆయన దర్శకధీరుడు రాజమౌళి ప్లాన్ ను కాఫీ కొట్టిన్నట్లు తెలుస్తుంది. రాజమౌళి RRR సినిమా కోసం సగం మందికి పైగా బాలీవుడ్ జనాలను దింపారు. అలియా, అజయ్ దేవగణ్ ఇలా..నార్త్ పాపులారిటీని వాడుకుని..సినిమా కి ప్లస్ చేసుకున్నాడు. ఇప్పుడు కొరటాల కూడా NTR 30 సినిమాలో బాలీవుడ్ హీరోయిన్స్ నే పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూయిస్తున్నారట. దిశా పటానీ,దీపికా పదుకునే, జాన్వీ కపూర్ లను దింపే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు మరో కీలక పాత్ర కోసం అజయ్ దేవగణ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట కొరటాల. ఒక్కవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయ్యి సినిమా హిట్ కొడితే మాత్రం..రాజమౌళి ప్లాన్ తో రాజమౌళి సెంటిమెంట్ నే బ్రేక్ చేసిన మొదటి డైరెక్టర్ శివ నే అవుతారు. తద్వారా NTR30 చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోతుంది.