మెగా ఫ్యామిలీలో అకీరా లొల్లి.. తొక్కేయాలని చూస్తుందెవరు..?

తరతరాలుగా సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఓ అలవాటు గా మారిపోయింది. అదేదో సినిమాలో ప్రభాస్ అన్నట్లు “వాడు పోతే వీడు..వీడు పోతే నేను..నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ అధికారం కోసం ఎగబడితే..” హా..గుర్తు వచ్చిందా..సేమ్ ఈ డైలాగ్ మాదిరే..ఇండస్ట్రీలో స్టార్ హీరోలు..వాళ్ల కొడుకులను రంగలోకి దింపుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్లు గా కూడా నటింపజేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆ పనులు కూడా మొదలు పెట్టేశారు.

ఇక వారసులు అనగానే టాలీవుడ్ లో ఫస్ట్ గుర్తు వచ్చేది మెగా ఫ్యామిలీ. సగం కి పై గా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఆ ఇంటినుండి వచ్చి సెటిల్ అయినవారే. ఇక మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన మెగా ట్యాగ్ అందించలేదు ప్యాన్స్..తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే అన్నట్లు వారసులు వేరే..అల్లుడు వేరే అంటూ పాపం అతని హీరోగా ఎదగనివ్వకుండా తొక్కేసారు. ఇప్పుడు ఉన్న హీరోలు కూడా స్టార్స్ అని చెప్పలేం ..ఒకటో రెండో హిట్లు కొట్టారు అంతే.

ఇక ఉన్న హీరోలకే దిక్కులేదురా సామీ అనుకుంటుంటే..కొత్తగా మరో వారసుడిని తెర పై చూడాలంటూ అభిమానులు హంగామా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ని హీరో గా తెర పై చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఆ వర్క్ జరుగుతుందన్న మ్యాటర్ కుడా లీకైంది. నిజానికి అకిరాకి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ లేదట..పిల్లాడు చాలా సైలెంట్. కానీ, ఫ్యాన్స్ కోసం ఆయన వారసుడుగా నెక్స్ట్ జనరేషన్ ఫ్యాన్స్ ని ఉత్సాహ పరచడం కోసం పవన్ కూడా అకీరా వెండి తెరకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే చదువు పూర్తి అయిన తరువాత అంటూ కండీషన్స్ పెట్టారు.

ఇక ఇప్పుడు అకీరా చదువు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అసలు రచ్చ మొదలైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ వారసుడిగా అకీరా అడుగుపెడితే..ఆయన ఫ్యాన్స్ అకీరా ని దేవుడు చేసేస్తారు..సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిస్తారు..ఇక డైరెక్టర్లు..నిర్మాతలు అందరూ..అకీరా వైపే మళ్ళి పోతారు. ఇది ఖచ్చితంగా ఇంకా సెటిల్ అవ్వని కొందరు మెగా హీరోలకు దెబ్బకొడుతుంది అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి అప్పుడే అకీరా సినిమాలోకి వద్దు..అమెరికా కు పంపించి ఇంకా పై చదువులు చదివిద్దాం..అంటూ అకీరా ఎంట్రీని అడ్డుకుంటున్నాడని సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటీ వరకు మెగా VS అల్లు ఫ్యాన్స్ గా ఉన్న వార్..ఇప్పుడు మెగా VS పవర్ స్టార్ గా మారనున్నట్లు తెలుస్తుంది.

Share post:

Popular