ఆచార్యలో ఆమెను లేపేశారటగా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనికి అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆచార్య చిత్రంలో మెగాస్టార్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన సీన్స్‌ను లేపేశారట చిత్ర యూనిట్. ఆచార్య షూటింగ్ చివరిదశలో కాజల్ పాత్రకు సంబంధించి కొన్ని సీన్స్ బాకీ ఉన్నాయట. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో, షూటింగ్ చేయలేనని చేతులెత్తేసిందట.

దీంతో చిర్రెత్తుకొచ్చిన కొరటాల అండ్ టీమ్, ఆచార్యలో కాజల్ పాత్రకు సంబంధించిన మెజారిటీ సీన్స్‌ను తొలగించినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే కేవలం ఓ పాటలో, మరియు కొన్ని సీన్స్‌లో మాత్రమే అమ్మడు కనిపిస్తుందని, మిగతా సినిమాలో ఎక్కడా మనకు కాజల్ పాప కనిపించదని తెలుస్తోంది. దీంతో కాజల్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆచార్య రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.