హీరోయిన్ శ్రీదేవిని.. అలా చేసినందుకు ఆ నిర్మాత అందరి ముందే అవమానించాడా… ?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు అందరూ అందాల తారలే.. తమ అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన వారే. కానీ అతిలోకసుందరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం శ్రీదేవి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా అటు శ్రీదేవి కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఎంతో మంది హీరోయిన్లు వచ్చి పోయినా శ్రీదేవి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆమె భౌతికంగా మనతో లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఆమె అందం ఆమె చేసిన సినిమాలు మాత్రం ఎప్పుడూ అందరితో ఉంటాయి అని చెప్పాలి.

సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే హీరో తర్వాత హీరోయిన్ అంటూ ఉంటారు. కానీ శ్రీదేవి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో మాత్రం మొదటి శ్రీదేవి డేట్స్ గురించే ఆలోచించేవారు దర్శకనిర్మాతలు. అంతేకాదు తమ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా పెట్టుకుంటే ఇక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించ వచ్చు అని నమ్మేవారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ శ్రీదేవి రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటూ శ్రీదేవిని తమ సినిమాల్లోకి తీసుకునేవారు.

ఇలా తెలుగు తమిళ కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన హవా నడిపించింది. ఇక తన అందం అభినయం గురించి అయితే కొత్తగా చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఇక ఇలా తమ సినిమాలో శ్రీదేవి నటిస్తే చాలు అనుకునే దర్శకనిర్మాతలు ఆరోజుల్లో ఉండేవారు.
కానీ ఒక నిర్మాత మాత్రం ఏకంగా సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి చేసిన పనికి అందరిముందే చెడామడా తిట్టేశాడు. ఇలాంటివి నా సినిమాల్లో కుదరదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట.

ఇంతకీ ఏం జరిగిందంటే అప్పట్లో స్టార్ నిర్మాత గా ఉండేవారు కాట్రగడ్డ మురళి.. అయితే కాట్రగడ్డ మురళి నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు శ్రీదేవి హీరోహీరోయిన్లుగా ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీదేవి తన పైట కొంగును తీసేసి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణంరాజును కౌగిలించుకొని ముద్దు పెట్టాలి.

ఇక దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పినట్లుగానే శ్రీదేవి చేసింది. కానీ ఇది చూసిన నిర్మాత మాత్రం శ్రీదేవి దగ్గరికి వెళ్లి ఇలాంటివి నా సినిమాల్లో కుదరవు అంటూ వార్నింగ్ ఇచ్చాడట. డైరెక్టర్ చెప్పినట్టే చేశాను అని చెప్పడంతో ఇక రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి ఇలాంటి సీన్లు చేయాలనుకుంటే ఎక్కడైనా చేసుకోసం నా సినిమాల్లో కుదరదు అని చెప్పడంతో ఇక ఆ సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేసి తీశారట.