ఆయన అంతగా నలిపేస్తున్నాడా..అంజలి భరించలేకపోతుందట..?

హీరోయిన్ అంజలి..పేరుకి తెలుగు అమ్మాయి నే అయినా.. తమిళంలో మంచి మంచి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోయింది. నాచురల్ గా నటించడం అంజలి స్పెషాలిటీ. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు చూస్తే..మనకు ఆ విషయం క్లీయర్ గా అర్ధమైపోతుంది. ఆమె తెలుగు లో లాస్ట్ గా నటించిన చిత్రం “వకీల్ సాబ్”. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన పవర్ ఫుల్ డైలాగ్స్ తో కేకలు పెట్టించింది.

ప్రజెంట్ తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చరణ్ పక్కన్న రెండో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా మరో హీరోయిన్ గా మనకు కనిపించనుంది. దిల్ రాజు నిర్మాణంలో దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడుగా వర్క్ చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి అగ్ర శ్రేణి సినిమాటోగ్రాఫ‌ర్ తిరుణావుక‌ర‌సు అలియాస్ తిరును తీసుకున్నాడు శంక‌ర్.

అయితే, శంకర్ తో సినిమా అంటేనే పక్క ప్లానింగ్ ..పర్ ఫెక్ట్ టైమింగ్ రెండు ఉండాలి. చెప్పిన టైమింగ్ కు చెప్పిన షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వాలి. అలా ఉంటాది శంకర్ తో వ్యవహారం అంటుంటారు ఆయనతో ఇది వరకు నటించిన నటులు. పాపం ఈ విషయం అంజలికి తెలియదు అనుకుంటా..ఆమె శంకర్ స్పీడ్ ని క్యాచ్ చేయలేకపోతుందంటున్నారు సినీ మేకర్స్. శంకర్ పాయింట్ ని అంజలి అందుకోలేకపోతుందట.. వరుస షెడ్యూల్స్ …కంటీన్యూ షూటింగ్స్ తో అంజలిని మెంటల్ గా నలిపేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అంజలి చరణ్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపిస్తుందని సమాచారం. కానీ చివర్లో పోలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోతుందట. ఇక శంకర్ పెట్టే పని టార్చర్ ను భరించలేకపోతున్నానని సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడిందట అంజలి. ఏమైన పెద్ద డైరెక్టర్లతో యవ్వారం మామూలూగా ఉండదు మరి అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular