ఆమె మా బాస్..చరణ్ చెప్పకనే చెప్పేశాడుగా..!!

“ఆచార్య”..కొరటాల శివ డైరెక్షన్ లొ మెగాస్టార్ చిరంజీవి-చరణ్ లు కలిసి హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చాలా రోజుల తరువాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం ఒకటి అయితే.. మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు..వాళ్ళ కోరికను నిజం చేస్తూ కొరటాల ఇద్దరిని కలిపేశాడు.

ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ..మరి కొద్ది రోజుల్లో ఏప్రిల్ 29 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆచార్య టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, బాబీ, మోహన్‌ రాజా, మెహర్‌ రమేష్‌ అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు ఫైట్ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌, అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా పాల్గొన్నారు. ఇక యాంకరింగ్ చేస్తూ సుమ ఎప్పటిలాగే అదరకొట్టేసింది.

సుమ యాంకరింగ్ అంటే ఫుల్ జోష్…ఫన్ ఉండాల్సిందే. ఇక ఈ ఈవెంట్ లోను..సుమ తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ నవ్వించింది. ఈ క్రమంలోనే..సుమ..చరణ్-చిరంజీవి-కొరటాల ముగ్గురు ని స్టేజీ పై నిల్చో పెట్టి వాళ్లను ఇరకాటంలో పెట్టే పలు పరసనల్ విషయాలను అడిగింది. అప్ కొఋస్..వాళ్ళు ఫన్నీ గా కామెడీ గా నే తీసుకుని ఆన్సర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సుమ చరణ్ ని..నీకు నాన్న గారు అంటే భయమా..? ఉపాసన అంటే భయమా? అంటూ అడుగుతుంది. దానికి చరణ్ జవాబిస్తూ..”నాన్నగారు అమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది చూసి నేను కూడా ఉపాసన దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటా. అయినా మా ఇంట్లో బాస్ మా అమ్మనే. అది కళ్యాణ్ బాబాయ్ కి అయినా.. నాకు అయినా..నాన్నగారి కైనా..” అంతూ నవ్వుతు సమాధానమిస్తాడు. దీంతో కొంచెం సేపు అక్కడ సందడి వాతవరణం నెలకొంది. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే ఆచార్య హిట్ అని అంటున్నారు అభిమానులు.