రాజమౌళి కొత్త కారు.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!!

రాజమౌళి.. ఆ పేరు చెప్పితే గూస్ బంప్స్ రావాల్సిందే. మన తెలుగు సినిమా ల ఖ్యాతి పెంచిన ఒక్కే ఒక్క డైరెక్టర్..రాజమౌళి. సినిమాలు అందరు డైరెక్టర్లు తీస్తారు. కానీ జనాలకు అర్ధమైయేలా.. జనాలు నచ్చేలా మెచ్చేలా..సినిమాలు తీయ్యడం కొందరి తరమే..అందులో ఫస్ట్ ఉంటాడు జక్కన్న. సింప్లిసిటీ కి చాలా దగ్గరగా..పబ్లిసిటీ కి చాలా దూరంగా ఉండటం ఈయన స్పెషాలిటీ. కేవలం సినిమా ప్రమోషన్స్ టైంలోనే బయట కనిపిస్తారు.

మిగతా టైం అంతా సినిమాలు ఎలా తెరకెక్కించాలి..? ఏ హీరో కి ఈ కధ సెట్ అవుతుంది అని తెగ ధింక్ చేస్తుంటారు..అందుకే ఇంత వరకు కెరీర్ లో ఒక్కటి అంటే ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. రీసెంట్ గా RRR తో ఇండియన్ సినిమా చరిత్రనే తిరగరాసిన ఘనత ఆయనకే దక్కింది. ఓ స్టార్ హీరో కన్న ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాజమౌళికి. పెద్ద పెద్ద స్టార్స్ ఈయన తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తుంటారు అంటేనే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. రెమ్యూనరేషన్ కూడా హీరోలకు ఏమాత్రం తగ్గని స్దాయిలో పుచ్చుకుంటారు అనే పేరుంది.

మరి అలాంటి జక్కన..ఓ కార్ కొన్నారు.. అంటే ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఉంటారో అని అనుకుంటారు అందరు. కానీ, జక్కన్నకి సినిమాల విషయంలోనే భారీ బడ్జెట్ లు వేస్తారు..ఫ్యామిలీ బడ్జెట్ లో సింపుల్ గా వెళ్లిపోతారు అని రీసెంట్ గా ఆయన కొన్న కారు ధర ను చూస్తే అర్ధమౌతుంది. ఇండియన్ సినిమా చరిత్ర ను తిరగరాసిన ఈయన రీసెంట్ గా ఓ కారు కొన్నారు. వోల్వో ఎక్స్‌సి40 కారు కొన్నారు జక్కన్న. రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు. రాజమౌళి కారు కొంటున్నారంటే కనీసం మూడు నాలుగు కోట్లు అయిన ఉంటుందని జనాలు ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ జక్కనా చాలా సింపుల్ గా ..45 లక్షలతో కొట్టేశారు. అఫ్కోర్స్ ఈ అమౌంట్ కూడా పెద్దదే. కానీ రాజమౌళి స్దాయి తో కంపేర్ చేస్తే చిన్నది అంటున్నారు ఫ్యాన్స్. వోల్వో కార్స్‌ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.