అన్నింట్లోనూ తారక్‌నే ముందుకు ఎందుకు పెడుతున్నారు?

మరో రెండు రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాను స్టార్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా నార్త్ ఇండియాలోనూ భారీ హైప్ క్రియేట్ చేసింది. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ నార్త్ ఇండియాలోని ప్రమోషన్స్‌లో జక్కన్న, చరణ్, తారక్‌లు చాలా యాక్టివ్‌గా పాల్గొంటూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా తారక్ నార్తి ఇండియన్ అభిమానులతో పాటు మీడియా వారిని కూడా చాలా ఉత్సాహంగా ఆకట్టుకుంటున్నాడు. తనదైన హిందీ స్పీచ్‌లతో అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తారక్‌కు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మంచి పట్టు ఉంది. దీంతో జక్కన్న అండ్ చరణ్‌లు నార్త్ ఆడియెన్స్‌ను మెప్పించే వాక్‌చాతుర్యం ఉన్న తారక్‌ను ముందుకు నెడుతున్నారు.

అయితే తారక్ హిందీ భాషను అనర్గళంగా మాట్లాడగలడు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాపై చేస్తున్న ప్రమోషన్స్‌లో హిందీ భాషలో మాట్లాడుతుంటే అక్కడి మీడియా వారు సైలెంట్‌గా వింటున్నారు. ఇక సినిమాలో కూడా తారక్ ఇదే విధంగా అన్నీ తానై ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి కొమురం భీం పాత్రలో తారక్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.