పుష్ప 2లో మార్పు.. ఇప్పట్లో లేనట్టేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి సుకుమార్ మరోసారి తనదైన మార్క్ వేసుకున్నాడు.

కాగా పుష్ప చిత్రం సక్సెస్ తో ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మరింత పవర్‌ఫుల్ గా తీర్చిదిద్దేందుకు సుకుమార్ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడట. అయితే ఈ సినిమా అందరూ అనుకుంటున్నట్లుగా ఈ ఏడాదిలో వచ్చే సూచనలు లేవని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం సుకుమార్ పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

నిజానికి ఈ సినిమాను ఏప్రిల్‌లోనే ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ ప్రస్తుతం స్క్రిప్టు పనులు ఇంకా పూర్తికాకపోవడం, స్క్రిప్టులో పలు మార్పులు చేస్తుండటంతో దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్‌లో కాకుండా మే చివరివారం లేదా జూన్ నెలలో ప్రారంభించనున్నారట. ఈ లెక్కన డిసెంబర్‌లో పుష్ప-2 రిలీజ్ కూడా వాయిదా పడటం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. మరి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిన పుష్ప చిత్రానికి సీక్వెల్ అయిన పుష్ప-2 థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.