పుష్ప 2లో మరో హీరోయిన్.. కానీ!

స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జు్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక మాస్ మూవీగా వచ్చిన పుష్ప చిత్రంలో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కట్టారు.

పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ బ్యూటీ డీగ్లామర్ పాత్రలో నటించినా, తన అందాల ఆరబోతను మాత్రం ఎక్కడా తగ్గించలేదు. అయితే పుష్ప చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ సినిమా సీక్వెల్ కోసం సుకుమార్ అండ్ టీమ్ అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయగా, తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరోయిన్ చేసేది కేవలం క్యారెక్టర్ పాత్ర లెండీ. ఒకప్పటి అందాల భామ ఇంద్రజ, ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో పుష్ప 2 చిత్రంలో కొన్ని కొత్త పాత్రలు ఉండబోతున్నాయని, అందులో భాగంగానే ఇంద్రజను ఓ పాత్ర కోసం చిత్ర యూనిట్ సంప్రదించిందట. ఇక పుష్ప 2లో తన పాత్ర నచ్చడంతో ఇంద్రజ కూడా ఓకే చెప్పేసిందట. అయితే పుష్ప చిత్రంలో బన్నీ చైల్డ్‌హుడ్ సీన్స్ చాలా తక్కువగా చూపించారు. ఇప్పుడు పుష్ప 2లో ఈ చైల్డ్‌హుడ్ ఫ్లాష్‌బ్యాక్ కీలకంగా మారనుందట. అందులోనే ఇంద్రజ పాత్ర కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సుకుమార్ పుష్ప 2 తో మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు రెడీ అవుతున్నాడని అర్థం అవుతోంది.