హాట్ కామెంట్ : చిరంజీవి ముందు పేర్ని నానిగాడు ఎంత ?

ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాలీవుడ్ ఫిల్మ్ చిరంజీవి అధ్యక్షన సినీ ప్రముఖుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు.ఈ సమావేశం తరువాత సానుకూల ఫలితం వస్తుందని సినీ ప్రముఖులుకు సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించారు చిరంజీవి తన స్థాయిని తగ్గించుకుని సమస్య పరిష్కరానికి జగన్తో మాట్లాడారు. ఈ విషయంలో చిరంజీవి ఎంత తగ్గి ఉన్నారన్నది స్వయంగా పేర్ని నానినే ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. సీఎం జగన్ సినీ ప్రముఖుల సమావేశం నేపథ్యంలో ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పేర్ని నాని ఫోన్ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన చిరంజీవి గురించి చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం . ‘‘చిరంజీవి గారు నాతో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారో లెక్క లేదు. చిరంజీవి గారి స్థాయి ఏంటి.. పేర్ని నాని గాడి స్థాయి ఏంటి? నాతో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారనుకుంటున్నారాయన? చిన్న పిల్లాడి లాగా ఫోన్ చేసి నానీ నీకు నేను ఫోన్ చేయొచ్చా? ఎన్నింటికి చేయను? ఎన్నింటికి నాతో మాట్లాడటానికి నీకు ఖాళీ ఉంటుంది? చిరంజీవి సినిమాలకు ఆయన కటౌట్లకు దండలేసి.. ఆయన సినిమా టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న వాళ్లం మేం.

అలాంటి మాకు చిరంజీవి గారు ఫోన్ చేసి నానీ నీతో ఎన్నింటికి మాట్లాడాలి అని అడిగారంటే ఏమనుకోవాలి. ఆ స్థాయిలో ఆయన ప్రయత్నం చేశారు. ఒక సమస్యను పరిష్కారం చేద్దామని ఆయననుకున్నారు. ఈ నానీగాడు బుడ్డోడా పెద్దోడా అని లేదు. ఆయనకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇది చేశారు’’ అని నాని వివరించారు.ఇంతలా చిరంజీవి తగ్గారు ఇండస్ట్రీ సమస్యల పరిస్కారం కోసం .


Leave a Reply

*