శ్రీజ …చిరు చెప్పినా వినడం లేదా..?

తమిళ్ హీరో ధనుష్ ,రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకున్నది అందరకి తెలిసిందే .కానీ ఆ న్యూస్ వైరల్ అవుతుండగానే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన ఓ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే చిరంజీవి చిన్న కూతురు అయినా శ్రీజ ,కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారం .గతంలో చిరంజీవి చిన్న కూతురు తను ప్రేమించివాడితో వెళ్లిన తరువాత ఆ విషయంలో మీడియాలో ఎంత రచ్చ అయిందో అందరకి తెలిసిందే .అప్పుడే చిరంజీవి తో పాటు మెగా కుటుంబం చాలా బాధ పడ్డారు.

తరువాత తన భర్త శిరీష్ తనని కట్నం కోసం వేధిస్తున్నాడని ,ఆ వేధింపులు తట్టుకోలేక శ్రీజ తన భర్తతో విడిపోయి మళ్లీ తండ్రి అయినచిరంజీవి దగ్గరకే వచ్చింది. కుటుంబంతో కలిసి ఉంటూ తన విడాకుల బాధను మర్చిపోయింది. కొన్నాళ్లకు చిరు తన స్నేహితుడి కొడుకు కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండో పెళ్లి చేశారు. స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు.

కానీ అనుకోకుండా చిరంజీవి కి మళ్లీపెద్ద కష్టమే వచ్చింది .శ్రీజ ,కళ్యాణ్ దేవ్ మధ్య ఈ మధ్యకాలంలో అభిప్రాయబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారని వార్తలొచ్చాయి. దానికి తగ్గట్లే శ్రీజ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తన పేరు పక్కన భర్త పేరును తొలగించింది. దీంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మరియు కుంటుంబ సభ్యలు శ్రీజ కి సర్ది చెప్పే ప్రయత్నం చేశారట.కానీ శ్రీజ వారి మాటలను వినడటం లేదంట .

శ్రీజ, కళ్యాణ్ దేవ్ లను కూర్చోబెట్టి ప్యాచప్ చేయడానికి మెగా కుటుంబం ట్రై చేసినట్లు తెలుస్తోంది. మెగాఫ్యామిలీకి చెందిన కొందరు సభ్యులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారట. కానీ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య సఖ్యత రాకపోగా.. మరింత దూరం పెరిగిందని సమాచారం. కూతురికి నచ్చజెప్పలేక చిరు కూడా సైలెంట్ అయిపోయారట. త్వరలోనే శ్రీజ తన విడాకుల విషయాన్ని అఫీషియల్ గా చెప్పే అవకాశాలు ఉన్నాయి.

అయితే చిరంజీవి వరసగా సినిమాల బిజీలో ఉన్నాడు .కొరటాల దర్శకత్వంలో రామ్ చరణ్ , చిరంజీవి కలిసి నటిస్తున్న ఆచార్య విడుదలకి సిద్ధంగా ఉన్నది .