షూటింగ్ దశలో బ్రేక్ పడ్డ పవన్ మూవీస్ ఏంటో తెలుసా?

చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన మేనరిజంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన ఇప్పటి వరకు 258 సినిమాలకుపైగా నటించాడు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ఉండగా మరికొన్ని యావరేజ్ సినిమాలున్నాయి. ఇంకొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తక్కువలో తక్కువ రూ. 50 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. దీన్ని బట్టే బాక్సాఫీస్ దగ్గర ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తాడు. అంటే ఏడాది ఒకటి లేదా రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తాడు. అయితే తాజాగా తను కూడా మరింత స్పీడ్ పెంచాడు. వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. ఆ తర్వాత భీమ్లానాయక్, హరిహర వీరమల్లు సినిమాలను చేస్తున్నాడు.

పవన్ కెరీర్ లో పలు సినిమాలు ఓకే చేసినా.. కొన్ని మాత్రం షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ కాంబినేషన్లు కూడా ఉన్నాయి.అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమాలు సత్యాగ్రహి, దేశీ, ప్రిన్స్ ఆఫ్ పీస్, కోబలి సినిమాలున్నాయి. దేశభక్తి నేపథ్యంలో సత్యాగ్రహి సినిమాను తానే స్వయంగా తెరకెక్కించాలి అనుకున్నాడు. అయితే తాను దర్శకత్వం వహించిన జానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాక దర్శకత్వం చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు. ఇప్పటికీ ఆ టైటిల్ పవన్ పేరిట రిజిస్టర్ అయి ఉంది. అటు పవన్, త్రివిక్రమ్ కలిసి కోబలి సినిమా చేయాలి అనుకున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కాలనుకుంది. కానీ స్క్రిప్ట్ దశలోనే ఆగపోయింది.

అటు పవన్ కల్యాణ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ నువ్వే కావాలి. ఈ సినిమా కథను దర్శకుడు విజయ్ భాస్కర్ తొలుత పవన్ కే చెప్పాడు. తను కూడా ఓకే చెప్పాడు. కారణాలు ఏంటో తెలియదు కానీ.. సడెన్ గా ఆయన ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గాడు. దీంతో తరుణ్. రిచా కలిసి నటించారు. అటు దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కాలనుకున్న సినిమా దేశీ. సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది. కానీ ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు. ఏసు క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా సింగీతం శ్రీనివాస రావు డైరెక్ష‌న్ లో పవన్ ప్రిన్స్ ఆఫ్ పీస్ మూవీ మొదలై ఆగిపోయింది.