శేఖర్ కమ్ములతో పని చేస్తే విడాకులు తప్పవా ?

శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. తను చేసిన ప్రతి సినిమా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఈయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సినిమాలు చాలా నేచురల్ గా ఉంటాయి. ప్రేక్షకుల మనుసుల్లో నిలిచిపోతాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తమిళ నటుడు ధనుష్ తో అక్కడ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయనతో కలిసి పని చేసిన హీరోల విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇప్పటికే నాగ చైతన్య శేఖర్ కమ్ములతో కలిసి వర్క్ చేశారు. లవ్ స్టోరీ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అటు సుమంత్ కూడా ఈ దర్శకుడితో కలిసి పని చేశాడు. గోదావరి సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. మంచి మ్యూజికల్ హిట్ కొట్టింది. అటు ప్రస్తుతం ధనుష్ తో కలిసి లవ్ స్టోరీ మూవీని తమిళంలో రీమేక్ చేయబోతున్నాడు. అయితే ఈ ముగ్గురు హీరోల విషయంలో ఓ విషయం కామన్ గా కనిపిస్తుంది. అదేంటంటే.. ఆయనతో సినిమాలు చేసిన కొద్ది రోజులకే తమ జీవిత భాగస్వాములతో విడాకుల ప్రకటన చేశారు.

లవ్ స్టోరీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటున్న సందర్భంలోనే తాను సమంతాతో విడిపోతున్నట్లు నాగ చైతన్య ప్రకటించాడు. ఇకపై ఎవరి జీవితం వారిదే అని వెల్లడించాడు. అటు సుమంత్ నటించిన గోదావరి సినిమా కూడా 2006లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా విజయం అందుకుంది. అదే సమయంలో సుమంత్ కూడా తన భార్యతో విడిపోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కలిసి ధనుష్ పని చేస్తున్నాడు. తాజాగా ధనుష్ కూడా తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. తన 18 ఏండ్ల వివాహ జీవితానికి గుడ్ బై చెప్పాడు.