`శ్యామ్ సింగ‌రాయ్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..నాని అద‌ర‌గొట్టాడుగా!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ 24(నిన్న‌)న‌ తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

విప్లవం, ప్రేమ ఈ రెండింటి నడుమా సాగే భావోద్వేగ ప్రయాణమే శ్యామ్ సింగరాయ్. వాసు అనే అప్‌కమింగ్‌ డైరక్టర్‌ పాత్రతో పాటు విప్లవ రచయిన శ్యామ్‌ సింగరాయ్‌ అనే పాత్రలోనూ నాని పరకాయ ప్రవేశం చేసి న‌టించాడు. అలాగే రాహుల్ డైరెక్షన్, నాని- సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ వంటివి కూడా చాలా బాగున్నాయి.

ఇక టాక్ బాగుండ‌డంతో.. నాని మొద‌టి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే అద‌ర‌గొట్టాడు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని తొలిరోజు ఏపీ, తెలంగాణలోనే 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక శ్యామ్ సింగ‌రాయ్ ఏరియాల వారీగా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

నైజాం- 2.12 కోట్లు
సీడెడ్ం- 0.62 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.51 కోట్లు
ఈస్ట్- 0.20 కోట్లు
వెస్ట్- 0.16 కోట్లు
గుంటూరు- 0.26 కోట్లు
కృష్ణా- 0.18 కోట్లు
నెల్లూరు- 0.12 కోట్లు
—————————————————————————–
ఏపీ+తెలంగా ఫస్ట్ డే కలెక్షన్స్- 4.17 కోట్లు (6.90 కోట్లు గ్రాస్)
—————————————————————————–
కర్ణాకట+రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.30 కోట్లు
ఓవర్సీస్- 1.35 కోట్లు
టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 6.82 కోట్లు (12 కోట్లు గ్రాస్)

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.22 కోట్ల బిజినెస్ చేసిన శ్యామ్ సింగ‌రాయ్‌..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.22.5 కోట్లను రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఇక ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా.. మ‌రో రూ.15.68 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే శ్యామ్ సింగ‌రాయ్ సూప‌ర్ హిట్టే.

Share post:

Popular