అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట తమిళంలో హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న అంజలి.. `ఫొటో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత షాపింగ్‌మాల్, జర్నీ సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ తెలుగందం.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం 11 జనవరి 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా అంజలి చేసిన సీత పాత్ర తెలుగు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత సీత లాంటి అమ్మాయి అందరి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అన్న భావన ఎందరినో మెదిలింది.
అంతలా అంజలి తన సహసజమైన నటనతో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత అంజలికి వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఆమెకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వంటి హిట్టు పడలేదు. అలాగే పల్లెటూరి అమ్మాయి సీతగా నటించిన అంజలి.. ఆ తర్వాత మోడ్రన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు చూడలేకపోయారు. పైగా ఒకసారి మోడల్ డ్రెస్సులో అంజలి హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళ గా.. అక్కడ లోపల ఉండేటువంటి ఒక నర్సు ఆమెను చూసి చాలా అసహ్యించుకుంటుందట.
దాంతో అంజలి ఏమైందని సదరు నర్సుని అడగగా.. అందుకు ఆమె `మా అత్త సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసి మీలాగా తనను ఉండమనేది. కానీ ఇప్పుడు మా అత్త ను తీసుకు వచ్చి మిమ్మల్ని చూపించాలని ఉంది.` అంటూ అంజలి డ్రస్సింగ్‌పై సెటైర్లు వేసిందట. నర్సు మాటలను జీర్ణించుకోలేకపోయిన అంజలి ఎంతో అవమానంగా ఫీలై సిగ్గుతో తలెత్తుకోలేకపోయిందట. ఇక ఆ తర్వాత అంజలి తాను సాఫీగా నటించిన సీత పాత్ర ప్రేక్షకులను ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకుందట.