ప్రమోషన్స్ పీక్స్.. చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)

December 14, 2021 at 1:15 pm

ఆర్ఆర్ఆర్ జోరు కారణంగా మొన్నటివరకు ప్రమోషన్స్ లో వెనుకబడ్డ పుష్ప టీం కూడా ఇప్పుడు జోరు పెంచింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులు ఆ తర్వాత వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిమానులతో అల్లు అర్జున్ ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడంతో ప్రోగ్రామ్ రద్దు చేశారు.

అయితే ఇవాళ చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే హిందీలో కూడా పుష్ప ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి’ సాంగ్ హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.

కాగా పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు మిగిలి ఉంది మూడు రోజులే కావడంతో అల్లు అర్జున్, రష్మిక మందన్న ఇతర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ జోరు పెంచారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో పుష్పపై అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుష్ప థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.250 కోట్లు చేయడం ఈ సినిమాపై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో అర్థమవుతుంది.

 

ప్రమోషన్స్ పీక్స్.. చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts