టాలీవుడ్ యంట్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రితూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్ కీలక పాత్రలను పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల కానుంది.
అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విడుదల చేశాడు. `ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు.. అసలు నమ్మకపోవచ్చు కూడా.. కానీ మీరిది నమ్మే తీరాలి` అంటూ నాజర్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు అదిరిపోయిందనే చెప్పాలి. ట్రైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని టీజర్ బట్టీ స్పష్టంగా అర్థమైంది.
టీజర్ బట్టీ.. సైంటిస్ట్ అయిన నాజర్ ప్రస్తుత కాలం నుంచి గతానికి వెళ్ళడానికి ఓ టైం మెషిన్ ని కనిపెడతారు. అయితే ఇందులో ఒక్కసారి మాత్రమే ప్రయాణించగలరనే కండిషన్ పెట్టగా.. శర్వా తన ఇద్దరు మిత్రులు వెన్నెల కిషోర్, ప్రియదర్శిలతో కలిసి తన బాల్యంలోకి వెళ్లినట్లు టీజర్ లో కనిపిస్తోంది.
మరి వీరు ముగ్గురు బాల్యంలోకి ఎందుకు వెళ్లారు..? అక్కడ ఏం చేశారు..? పాస్ట్ నుంచి మళ్లీ ఈ ముగ్గురు ఫ్యూచర్‌లోకి ఎలా వచ్చారు..? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో శర్వా తల్లిగా అమల, ప్రేయసిగా రితూ వర్మ కనిపించబోతున్నారు.