ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో తన ఖాతాలో సక్సెస్ వేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆమె హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల విజయం తో బాగా దూసుకుపోతోంది. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీ థియేటర్ లో సందడి చేస్తుండగా.. సాయి పల్లవి ఓ సాహసానికి పూనుకుంది.
శ్యామ్ సింగరాయ్ సాయి పల్లవి దేవదాసి పాత్రలో చేసింది. ఎప్పటిలాగే సాయిపల్లవి పాత్ర ఈ సినిమాలో హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ని క్లియర్ గా చూడాలని సాయి పల్లవి ఆశ పడడంతో.. దాని కోసం ఆమె ఒక పెద్ద సాహసమే చేసింది. హైదరాబాదులో శ్రీ రాములు థియేటర్ కి ఆమె మారు వేషంలో వెళ్ళింది.
బురఖా ధరించిన సాయి పల్లవి శ్రీ రాములు థియేటర్ లు పూర్తి సినిమా చూసింది. అయితే ఈమె ఎవరు గుర్తుపట్టలేదు. సినిమా హాల్ లో నుంచి బయటికి వస్తుంటే ఒక రిపోర్టర్ ఆమెను సినిమా ఎలా ఉంది అని స్వయంగా అడిగారు. అయితే సాయి పల్లవి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. హాలు నుండి బయటకు వచ్చాక కారులో ముందు సాయి పల్లవి తను వేసుకున్న బురుఖా ను తీసివేసింది. దీంతో అక్కడున్న నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆమెతో పాటు సెక్యూరిటీ లేకుండా ఒక వ్యక్తి తో మాత్రమే థియేటర్ కి వెళ్ళింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది
https://youtu.be/H4yIS88b7xI