కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి రెండో చిత్రం `శ్యామ్ సింగరాయ్`. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
తొలి చిత్రం ఉప్పెనలో పల్లెటూరి అమ్మాయిగా అందం, అభినయంతో ఆకట్టుకున్న కృతి శెట్టి.. శ్యామ్ సింగ్‌రాయ్‌లో మాత్రం ఇంటిమేట్, బోల్డ్ సీన్స్ తో పాటు సిగరెట్ తాగడం, మందు కొట్టడం లాంటి సన్నివేశాల్లోనూ నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై పలువురు నెటిజన్లు కృతి శెట్టిని తప్పుబడుతూ నెట్టింట తెగ రచ్చ కూడా సృష్టించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. అలాంటి సీన్స్‌లో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను.
శ్యామ్ సింగ రాయ్‌లో వాటితో కథ ముడి పడి ఉంది.అలాంటప్పుడు అలాంటి సీన్లు చేస్తే తప్పేంటి.` అంటూ కృతి పేర్కొంది. అలాగే `సిగరెట్ తాగే సన్నివేశాల్లో ఎంతో ఇబ్బంది పడ్డాను. నాకోసం ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. అయినప్పటికీ ఆ సీన్స్‌ను చిత్రీకరించే సమయంతో తెగ వణికిపోయాను`అంటూ కృతి చెప్పుకొచ్చింది. దీంతో కాక రేపుతున్న కృతి శెట్టి కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.