ఆగనంటున్న ఆర్ఆర్ఆర్.. మూడో సాంగ్‌కు డేట్ ఫిక్స్!

బాహుబలి సృష్టికర్త ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే జనాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఫిక్షనల్ కథతో జక్కన్న తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను దున్నేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా రాజమౌళి ఎప్పటిలా కాకుండా ఈసారి తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. గతంలో ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ల కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పార్ట్ పూర్తికాగానే వరుసబెట్టి ఈ సినిమా నుండి అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లు, దోస్తీ థీమ్ సాంగ్, ఆర్ఆర్ఆర్ గ్లింప్స్, నాటు నాటు పాట అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఒకటే సందడి చేస్తోంది. తాజాగా నా పాట వీరనాటు అనే పాటను రిలీజ్ చేసిన జక్కన్న అండ్ టీమ్ మరో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ సినిమాలోని మూడో లిరికల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ నుండి మూడో పాటను నవంబర్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ పాట కూడా మొదటి రెండు పాటల మాదిరిగానే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆర్ఆర్ఆర్ యూనిట్ అంటోంది. మరి నిజంగానే నవంబర్ 18న ఆర్ఆర్ఆర్ నుండి మూడో పాట రిలీజ్ కాబోతుందా? అనే విషయానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.