ర‌జినీకాంత్‌కు త‌ల్లిగా శ్రీ‌దేవి న‌టించిన సినిమా ఏంటో తెలుసా?

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వ‌య‌సులోనే సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీ‌దేవి.. సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను కొన‌సాగించి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. అదే స‌మ‌యంలో ఎన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను ద‌క్కించుకుంది.

Sridevi birth anniversary: Lesser-known facts about India's first female  superstar

తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన‌ శ్రీ‌దేవి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా నటించారన్న విష‌యం మీకు తెలుసా? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పైగా రజనీకాంత్ తల్లి పాత్రలో నటించినప్పుడు శ్రీ‌దేవి వయస్సు కేవలం 13 సంవత్సరాలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Moondru Mudichu: Rajnikanth and Sridevi's First Lead roles! |  dontcallitbollywood

దిగ్గజ ధీరుడు కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `మూండ్రు ముడిచ్చు`. త‌మిళంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలోనే ర‌జినీకి శ్రీ‌దేవి త‌ల్లిగా న‌టించింది. ఈ సినిమాలో ఆమె ఎంత‌గానో ప్రేమించిన వ్యక్తి(క‌మ‌ల్ హాస‌న్‌)ని రజనీకాంత్ శ్రీ‌దేవికి దూరం చేస్తాడు. దాంతో అత‌డిపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు రజినీకాంత్ తండ్రి ని వివాహం చేసుకుంటుంది. ఆ విధంగా రజనీకాంత్ కు ఆమె సవతి తల్లి గా మారుతుంది.

when age of 13 sridevi played a role of Rajinikanth's mother | Sridevi  death anniversary: 13 साल की उम्र में Sridevi ने निभाया था Rajinikanth की  मां का किरदार | Hindi News, बॉलीवुड

1976 లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విష‌యం సాధించింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ర‌జినీకాంత్‌, శ్రీ‌దేవిలు జంట‌గా ఎన్నో చిత్రాలు న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంతో పాటుగా హిట్ పెయిర్‌గానూ గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే.