మోహన్ బాబు పెద్ద షాకే ఇచ్చాడుగా..చిరంజీవి ఇది ఊహించనేలేదట..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు రేపు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో కలిసి నాగబాబు పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు డైరెక్ట్ గా నా మద్దతు ప్రకాష్ రాజ్ కేనని ప్రకటించాడు.

మా ఎన్నికలు జరిగిన ప్రతిసారి చిరంజీవి స్వయంగా నా మద్దతు ఈ అభ్యర్థికే అని ప్రకటించింది లేదు. నాగబాబు ఎవరికి సపోర్ట్ ఇస్తాడో అతడికే చిరంజీవి మద్దతు ఉంటుందని చెబుతారు.తన అన్నయ్య మాటలే తన మాటలుగా నాగబాబు చెబుతారని టాక్. మొదటినుంచి మోహన్ బాబుకు చిరంజీవి కి పడదని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే వారిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. మా ఎలక్షన్స్ సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు మొదట ప్రకటించింది ప్రకాష్ రాజే. ఆ తర్వాత అతడికి నాగబాబు మద్దతు ఇచ్చాడు.

అయితే అనూహ్యంగా మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు అధ్యక్ష పోటీలో నిలిచాడు. మంచు కుటుంబం నుంచి పోటీలో నిలుస్తుందని మొదట చిరంజీవికి తెలియదని సమాచారం. ఒకవేళ ముందే తెలిసి ఉంటే ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సపోర్ట్ చేసే వాడు కాదని అంటున్నారు.
ఎందుకంటే ప్రకాష్ రాజ్ చిరంజీవికి సన్నిహితుడైతే కాదు. పైగా పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయని చెబుతారు.

ప్రస్తుతం చిరంజీవి ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మద్దతు ఇస్తుండడంతో చిరంజీవి మోహన్ బాబు మధ్య మళ్లీ గ్యాప్ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయమై చిరంజీవి ఇరకాటంలో పడ్డట్లు చెబుతున్నారు.మంచు విష్ణు పోటీ విషయం మొదట తెలిసి ఉంటే ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఇచ్చేవారు కాదని తెలుస్తోంది. మరో అభ్యర్థిని నిలబెట్టడమో లేదా మంచు విష్ణుకు సపోర్ట్ చేయడమో జరిగేదని అంటున్నారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ కారణంగా చిరంజీవి, మోహన్ బాబు మధ్య మళ్లీ దూరం పెరుగుతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.