మూత్రం పోస్తుండగా ఊహించని ఘటన.. !?

టాయిలెట్ కి వెళ్లి మూత్రం పోస్తుండగా ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ప్యాంటు జేబులో ఉన్న తుపాకీ డాం అని పేలింది. దీంతో అతని కాలుకి గాయం అయ్యింది. అయితే ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ జరిగింది.

ఓ 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్ కి వెళ్లి ప్రశాంతంగా మూత్రం పోసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో తన ప్యాంట్ లో ఫుల్ లోడ్ తో ఉన్న తుపాకీ ఒక్కసారిగా పేలింది. అసలు ఇలా ఎలా జరిగింది అనుకుంటున్నారా..? ఇదిగో ఇలాగే.. మూత్రం పోసుకునేందుకు అతను ప్యాంట్ తీసుకునే క్రమంలో పొరపాటున అతని ప్యాంట్ జేబులో ఉన్న తుపాకీ ట్రిగ్గర్ ను నొక్కాడు. అంతే ఒక్కసారిగా డాం అని తుపాకీ పేలింది. బుల్లెట్ నేరుగా అతని కాలికి తగిలింది. లేకపోతే ప్రాణంపోయి ఉండేది. తుపాకీ పేలుడుతో భారీ శబ్దం రాగా అక్కడే టాయిలెట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడ్నుంచి భయంతో పరుగులు తీశాడు. ఆ తరువాత టాయిలెట్లో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి టాయిలెట్ రూమ్ వద్దకు వచ్చాడని, అక్కడే కొంత మంది వ్యక్తులతో కాసేపు మాట్లాడాడని అన్నారు. అయితే కొద్దీ సేపు తరువాత లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న మరో వ్యక్తి భయంతో బయటకు పరుగులు తీసాడని.. దీంతో ఏదో జరిగిందని భావించిన స్థానికులు భద్రతా సిబ్బందికి, పోలీసులకి సమాచారం అందచారని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్ పేలిన వ్యక్తి కాలికి గాయం తగిలి పడి ఉండడం చూశారు. వెంటనే అతన్ని బల్లే వ్యూ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.