`మా` వార్‌లో ప్ర‌కాష్ రాజ్ ఓట‌మికి నాగ‌బాబే కార‌ణ‌మా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. చివరి వరకు ప్రకాష్ రాజ్‌ పోటీ ఇచ్చినట్లే కనిపించినా.. ఆఖ‌రి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల భారీ తేడాతో గెలుపొందాడు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి.

అయితే మెగా ఫ్యామిలీ అండదండలు ఉండి కూడా ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మా అధ్యాకుడిగా పోటీలో నిలిచి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ లోని బలహీనతలను ప్రస్తావిస్తే.. ముందుగా చెప్పుకోవాల్సిన అంశం నాన్ లోకల్. దీనికి తోడు నాగ‌బాబు కూడా ప్ర‌కాష్ రాజ్‌ ఓట‌మికి కార‌ణం అంటూ ప‌లువురు నెట‌జ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిజానికి నాగబాబు మొద‌టి నుంచీ ప్ర‌కాశ్ రాజ్‌కు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు.

అయితే మంచు విష్ణు చాలా తెలివిగా బ‌య‌టి రాష్ట్రాల వారికి ఫ్లైట్ టికెట్లు వేయించి, ఎయిర్ పోర్ట్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ కూడా పెట్టించి ఓటింగ్‌కు ర‌ప్పించారు. కానీ, నాగ‌బాబు క‌నీసం త‌న కొడుకు వ‌రుణ్ తేజ్‌, కూతురు నిహారిక‌ల‌ను కూడా పోలింగ్ కేంద్రానికి ర‌ప్పించ‌లేక‌పోయాడు. ఇత‌ర మెగా హీరోల‌తోనూ ఓట్లు వేయించ‌లేక‌పోయాడు. అలాగే ఎన్నిక‌లకు ముందు నాగ‌బాబు సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావుపై తీవ్ర ప‌దజాలంతో దూషించాడు. ఇవ‌న్నీ ప్ర‌కాష్ రాజ్‌కు మైన‌స్ అయ్యాయ‌ని.. అందువ‌ల్లే ఆయ‌న ఓట‌మిపాల‌య్య‌య‌ని అంటున్నారు.