అమితాబ్ బచ్చన్ పై.. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ బాలీవుడ్ లొ రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారంటూ ఎవరూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ఆయనపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ తో రాంగోపాల్ వర్మ పలు సినిమాలు తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్నేహం మేరకే సర్కార్ అమితాబ్ అంటూ సంబోధిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ.

సర్కార్ అమితాబచ్చన్ మీరు ఎలాగైనా అనేక తరాల హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తారు. కానీ శారీరకంగా కూడా మీరు ఎప్పటికీ జీవిస్తారని నేను అనుకుంటున్నా అని అన్నారు. మీరు అన్ని విషయాల్లోనూ విజయం సాధించారు. మీరు సూపర్ హ్యూమన్ అంటూ ఆర్జివి చెప్పుకొచ్చారు.దీంతో రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడం వల్ల అమితాబచ్చన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రాంగోపాల్ వర్మ ఇలా మెచ్చుకోవడం అందరికీ సంతోషాన్నిచ్చింది.

https://twitter.com/RGVzoomin/status/1447420850202824710?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1447420850202824710%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-12241039122478641615.ampproject.net%2F2109272305001%2Fframe.html