సామ్ స్టైలిస్ట్‌కు చావు బెదిరింపులు..చైతుపై మండిప‌డ్డ ప్రీత‌మ్‌!

October 11, 2021 at 1:41 pm

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం ఏంటో బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ర‌క‌ర‌కాల ఊహాగానాలు మాత్రం తెర‌పైకి వ‌చ్చాయి. ముఖ్యంగా త‌న పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ తో స‌మంత ఎఫైర్ పెట్టుకుంద‌ని.. అందుకే చైతుకు విడాకులు ఇచ్చింద‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి.

Samantha Shares Cryptic Post After Divorce With Naga Chaitanya, Questions Society For Judging Women

అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా ఓ జాతీయ మీడియాలో ప్రీత‌మ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను సమంతను అక్కా అని పిలుస్తానని, ఆమె కూడా త‌న‌ను మంచి త‌మ్ముడిగా ట్రీట్ చేస్తుంద‌ని, అలాంటి త‌మ‌కు అక్ర‌మ సంబంధం అంట‌క‌ట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అలాగే త‌న‌ను తిడుతూ చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారని, కొంద‌రైతే చంపేస్తామని బెదిరిస్తున్నార‌ని, త‌న‌ కెరీర్‌ను నాశనం చేస్తామంటున్నార‌ని ప్రీత‌మ్ వాపోయాడు.

Samantha : అప్పట్లోనే సమంతకు ఐ లవ్ యూ చెప్పిన ప్రీతమ్ జుకల్కర్.. అందుకే చైతన్యకు విడాకులు.. అసలు ఎవరితను? | The Telugu News

ఇక స‌మంతకు, త‌నకు మధ్య ఉన్న అనుబంధం గురించి నాగ‌ చైతన్యకు పూర్తిగా తెలుస‌ని.. కానీ, త‌మ‌పై వ‌స్తున్న అస‌త్య ప్ర‌చారంపై చైతు క‌నీసం స్పందించ‌డం లేద‌ని ప్రీత‌మ్ మండిప‌డ్డాడు. ఆయన ఒక్క స్టేట్‌మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది అని ప్రీత‌మ్ చెప్పుకొచ్చారు. మ‌రి ఇప్ప‌టికైనా చైతు స్పందిస్తాడో..లేదో..చూడాలి.

సామ్ స్టైలిస్ట్‌కు చావు బెదిరింపులు..చైతుపై మండిప‌డ్డ ప్రీత‌మ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts