అక్కడ రెస్టారెంట్లో తినాలంటే కాళ్లు తడిచిపోవాల్సిందే..?!

October 11, 2021 at 1:42 pm

కరోనా తగ్గుముఖం పట్టాక రెస్టారెంట్లకు పూర్వ వైభవం తీసుకురావడానికి యజమానులు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. సరికొత్తగా ఆలోచిస్తూ వారు వేసే ఐడియాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. రెస్టారెంట్లను వెరైటీగా డిజైన్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. కస్టమర్లు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకోసమే వారు రకరకాలుగా ఆలోచిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. బంపరాఫర్లను పెడుతుండటంతో కస్టమర్లు కూడా ఆ రెస్టారెంట్ల వైపు చూస్తున్నారు. కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా రెస్టారెంట్లను యజమానులు డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు యజమానులు చెట్లపైన రెస్టారెంట్లను నిర్మిస్తున్నారు. ఇంకొందరైతే నీటి అడుగు భాగంలో రెస్టారెంట్లను నిర్మిస్తూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. తాజాగా ఓ రెస్టారెంటును నది ఒడ్డున నిర్మించడంతో అందరూ ఆ రెస్టారెంట్ కు వెళ్లడానికి క్యూ కడుతున్నారు.

 

నడి ఒడ్డును ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌కు వెళ్లినట్లైతే మోకాళ్ల లోతు వ‌ర‌కు నీళ్లు అనేవి ఉంటాయి. కచ్చితంగా కాళ్లను తడుపుకుంటూ ప్యాంటును తడుపుకుంటూ తమకు కావాల్సిన ఫుడ్ ను తినాల్సిందే. అందుకే ఈ రెస్టారెంట్ అందరికీ స్పెష‌ల్ గా మారింది. ఇంతటి ఆశ్చర్యకరమైన ఈ రెస్టారెంట్ థాయిలాండ్‌లో ఏర్పాటు చేశారు. చావో ఫ్రాయా అనే నది ఒడ్డునే ఈ రెస్టారెంట్ ను నిర్మించారు. ఈ అద్బుతమైన రెస్టారెంట్ పేరు అంటిక్ రెస్టారెంట్ అని నామకరణం చేశారు. థాయిలాండ్‌ కి వచ్చే పర్యాటకుల్లో చాలామంది చావో ఫ్రాయా నది వద్దకు వెళ్తారు. ఆ సందర్భంగా వారు ఈ రెస్టారెంట్ ను సందర్శిస్తారు. ఇక్కడి రుచులను ఆస్వాదిస్తారు. ఈ ప్రాంతంలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయిగానీ నీటిలో ఉండే రెస్టారెంట్ ఇది మాత్రమే అని చెప్పాలి. ఈ రెస్టారెంట్ సరికొత్తగా ఉండటంతో చాలామంది టూరిస్టులు నీళ్లలోనే కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్నారు. డైనింగ్ ఏరియాకు వ‌చ్చి అక్క‌డ కూర్చోవడంతో వారి కాళ్ల‌కు నీటి అలలు తాకుతాయి. వాటిని ఎంజాయ్ చేస్తూ పర్యాటకులు ఫుడ్‌ ను తింటారు. ప్రస్తుతం ఈ వెరైటీ రెస్టారెంట్ కు టూరిస్టులు క్యూ కడుతున్నారు.

అక్కడ రెస్టారెంట్లో తినాలంటే కాళ్లు తడిచిపోవాల్సిందే..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts