మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవి.. ఏమన్నారంటే?

October 25, 2021 at 5:54 pm

మా ఎన్నికలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సర్కస్ అని, అందులో ఉండే సభ్యులు అందరూ కూడా జోకర్లు అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ మా ఒక సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ సార్ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది జరిగిన తరువాత ఒక పది రోజులకు రాంగోపాల్ వర్మ మనోజ్ కౌంటర్ పై స్పందించారు.

మనోజ్ చేసిన కౌంటర్ కి రీ ట్వీట్ చేస్తూ నేను రింగ్ మాస్టర్ ని కాదు, సర్కస్ లో అందరికీ వినోదం పంచే కోతిని మాత్రమే అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ విషయంపై మంచు మనోజ్ స్పందిస్తూ మనం అందరం ఒకటే సార్ సేమ్ సర్కస్ కి చెందిన వాళ్ళమే అంటూ సమాధానమిచ్చాడు.

దీనికి ఆర్జివి మరొక ట్వీట్ చేస్తూ హే మనోజ్ నీ డీపీ స్టేటస్ అంటే మా ఇంకా గొప్పది అని అనుకుంటున్నాను అంటూ రిప్లై ఇవ్వగా దీనికి మనోజ్ మీరు చెప్పింది కరెక్టే సర్ అంటూ ట్వీట్ చేశాడు.

అనంతరం ఆర్జివి అవును అంటూ సమాధానం ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా మనోజ్ రాంమ్ గోపాలవర్మ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.

మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవి.. ఏమన్నారంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts