ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?

పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి అంటూ ఓ పెద్ద వేదికపైనే అసలు విషయాన్ని బయట పెట్టారు.ఆ హీరోయిన్ ఎవరు,?తెలుసుకుందాం..

తాజాగా హరిశంకర్ ఒక వేదికపై మాట్లాడుతూ మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి. మనందరికీ సంవత్సరం నుంచి ప్యాండమిక్ సిట్యుయేషన్ వుంది. కానీ ఒక్క పర్సెంట్ మాత్రం పాండమిక్ లేదు, లాక్ డౌన్ లేదు. కొంచం లో ఆమెకు మాత్రమే లాక్ డౌన్, కరోనా ఏదీ లేదు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ పూజా హెగ్డే. సాధారణంగా మనం హీరోయిన్ సినిమాల షూటింగుల కోసం డేట్స్ తీసుకుంటాము.

https://youtu.be/DJnexK9aQfw

ఈ ఒక్క పూజాహెగ్డే విషయంలో మాత్రం ఫోన్ కాల్ కు కూడా డేట్ తీసుకోవాల్సి వస్తోంది. షి ఈజ్ ఆపోజిట్ టు అఖిల్, షి ఈజ్ ఆపోజిట్ టు పవన్, షి ఈజ్ ఆపోజిట్ టు బన్నీ, షి ఈజ్ ఆపోజిట్ టూ ప్రభాస్, షి ఈజ్ ఆపోజిట్ టు మహేష్ బాబు.. బట్ హర్ మేనేజర్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ది డైరెక్టర్స్. అంటూ పూజ పై ప్రశంశల వర్షం కురిపించాడు. పూజ చాలా సంతోషంగా ఉంది అని వేదికపై తెలిపాడు.