వామ్మో.. నవంబర్ లో బ్యాంకులకు 17 రోజుల సెలవులా..?!

త‌ర‌చూ బ్యాంక్ ప‌నుల‌పై తిరిగే వారు.. ఖ‌చ్చితంగా ఒక విష‌యం తెలుసుకోవాలి. సెల‌వులు..అవును, బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవ‌డం ద్వారా త‌మ స‌మ‌యం వృధా కాకుండా ఉంటుంది. ఇక వచ్చే న‌వంబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆ నెల‌లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి.

Bank Holidays in October: Banks to Remain Shut for 9 Days Straight from Tomorrow. Full List

అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఈ సెలువులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే..నవంబర్‌ 4 దీపావళి, 7వ తేదీ ఆదివారం, 13వ తేదీ రెండో శనివారం, 14న ఆదివారం, 19న గురునానక్‌ జయంతి, కార్తిక పూర్ణిమ, 27న నాలుగో శనివారం, 28 ఆదివారం రోజుల్లో బ్యాంకులు పని చేయవు.

Bank Holidays In Oct: Alert! Banks to remain close for 21 days

వీటిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన పనుల‌ను ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఇకపోతే బ్యాంక్ హాలిడేస్ ఉన్నా కూడా బ్యాంక్ కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.