ఆ బెడ్రూమ్ సీన్‌ను ఏడు సార్లు షూట్ చేశాం.. అన్ని యాంగిల్స్‌లో కెమెరా పెట్టేసరికి బోరున ఏడ్చేసా: నటి

October 26, 2021 at 9:27 am

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “సేక్రేడ్‌ గేమ్స్” ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రైమ్&థ్రిల్లర్ సిరీస్‌ను మైండ్ బెండింగ్ చిత్రాలు తీసే మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రూపొందించారు. ప్రేక్షకులతో సహా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న ఈ సంచలన సిరీస్‌లో కొన్ని సీన్లు వేరే లెవెల్లో ఉంటాయి. వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, హాట్ బ్యూటీ కుబ్రా సైత్ (Kubbra Sait) మధ్య సాగే ఓ బెడ్రూమ్ సీన్ ప్రేక్షకుల మతి పోగొట్టిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో కుబ్రా సైత్ బోరున ఏడ్చేసింది. తాజాగా ఈ విషయాన్ని మషబుల్ ఇండియా (Mashable India)తో పంచుకుందీ ముద్దుగుమ్మ.

సీక్రెట్ గేమ్స్ సిరీస్‌లో హిజ్రా పాత్ర పోషించిన కుబ్రా సిద్దిఖీతో లవ్‌లో పడుతుంది. స్క్రిప్ట్ ప్రకారం ఈ లవ్ ట్రాక్‌లో కుబ్రా, నవాజుద్దీన్ కొన్ని హాట్ సీన్లలో కూడా నటించాల్సి వచ్చింది. అన్ని సీన్స్ ఓకే కానీ ఓ శృంగార సన్నివేశం మాత్రం కుబ్రాని తెగ ఇబ్బంది పెట్టింది. ఆ సీన్‌ను అనురాగ్ కశ్యప్ 7 సార్లు ఏడు యాంగిల్స్‌లో చిత్రీకరించారట. ఆ సమయంలో బాగా ఇబ్బంది పడిపోయిన కుబ్రా చివరికి బాగా ఏడ్చేసిందట. ఆ సీన్ ఎక్కడైతే షూట్ చేశారో.. అక్కడే కుప్పకూలిపోయి బాగా కన్నీరు కార్చిందట. ఇది చూసిన నవాజుద్దీన్ సిద్దిఖీ ఆమెను ఓదార్చాలింది పోయి.. “నువ్వు బయటికి వెళ్లు.. ఇంకా నా సీన్ పూర్తి కాలేదు” అని చెప్పాడట. దాంతో ఈ ముద్దుగుమ్మ కన్నీళ్లు ఆగలేదట.

“ఈ సీన్ మొదటి టేక్ పూర్తయ్యాక అనురాగ్ వచ్చి ఇదే సీన్‌ను ఇంకోసారి త్వరగా షూట్ చేద్దామన్నారు. రెండోసారి ఫినిష్ అయ్యాక కూడా మరోసారి ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా కానిచ్చేద్దామన్నారు. మూడోసారి కెమెరాను సిద్దిఖీ వైపు పెట్టి ఏదో షూట్ చేశారు. కానీ 7వ సారి కూడా ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను ఏడ్చేసా. ఆ సమయానికి నేను నిజంగా కంటతడి పెట్టుకున్నాను. అంతేకాదు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. సిద్దిఖీ నా వద్దకు వచ్చి థాంక్యూ! ఇక నువ్వు బయటికి వెళ్లిపోతావా? అని అడిగారు. అప్పుడే సీన్ అయిపోయిందని నాకు తెలిసింది. అప్పటికీ నేను ఫ్లోర్ పై కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు ‘నా సీన్ ఇంకా మిగిలి ఉంది. నువ్వు బయటికి వెళ్లిపో’ అని సిద్దిఖీ అన్నారు” అంటూ కుబ్రా వాపోయింది.

ప్రస్తుతం బాలీవుడ్ నెటిజన్లు అనురాగ్ కశ్యప్ పై మండిపడుతున్నారు. “నీకూ ఓ కూతురు ఉందని గుర్తు పెట్టుకో. ఆడవారిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు” అని కొందరు డైరెక్టర్ కు చివాట్లు పెడుతుంటే.. “నీకు ఇష్టమయ్యే సీన్ ఒప్పుకున్నావు కదా మరి ఎందుకు ఏడవటం” అని ఇంకొందరు కుబ్రాపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సేక్రేడ్‌ గేమ్స్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిలో సెక్స్, నగ్నత్వం, హింస, అసభ్య పదజాలంతో కూడిన సన్నివేశాలు ఉంటాయి. వెబ్ సిరీస్లకు సెన్సార్ లేకపోవడంతో అనురాగ్ కశ్యప్ కెమెరాతో రెచ్చిపోయారనే చెప్పాలి.

ఆ బెడ్రూమ్ సీన్‌ను ఏడు సార్లు షూట్ చేశాం.. అన్ని యాంగిల్స్‌లో కెమెరా పెట్టేసరికి బోరున ఏడ్చేసా: నటి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts