‘ఏజెంట్లతో పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్న మంచు విష్ణు?

October 5, 2021 at 11:59 am

అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు మంచు విష్ణు.. మరోవైపు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.. ఇకపోతే ప్రచారంలో భాగంగా వీరిరువురూ రాజకీయ నేతల కంటే దారుణంగా తిట్టుకుంటున్న విషయం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం.. అంతేకాదు రాజకీయ నేతలకు మించి డబ్బులు ఖర్చు చేస్తున్నారట.. వీరు మా అధ్యక్ష పదవి నుంచి ఎలాంటి లాభం పొందాలి అనుకుంటున్నారో తెలియదు కానీ ఇంత దారుణంగా తిట్టుకోవడం ఇదే మొదటిసారి అంటూ సినీ ఇండస్ట్రీలో నటులు ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా మంచు విష్ణు బ్యానర్ పై ప్రకాష్ రాజ్ కంప్లైంట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్యానల్ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు..మా ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.. అంతే కాదు మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని కూడా ప్రకాష్ రాజ్ తెలిపాడు.. ప్యానెల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. అనంతరం జీవిత రాజశేఖర్, శ్రీకాంత్ తో కలిసి ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు..

60 సంవత్సరాలు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్ కు అర్హులు.. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు..అంతే కాదు నిన్న సాయంత్రం మంచు విష్ణు తరఫున ఒక వ్యక్తి 56 మంది సభ్యుల తరఫున 28 వేల రూపాయలు కట్టడం జరిగింది..ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు..? కృష్ణ, కృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్, శారద, శరత్ బాబు వంటి తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులను కూడా మంచు విష్ణు తరపు వ్యక్తే కట్టారు.. ఆగంతుకుల తో మా ఎన్నికలు నిర్వహిస్తామా.. ఇలా గెలుస్తారా.. మీ హామీలు చెప్పి గెలవరా.. ఇంత దిగజారుతారా.. ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, నాగార్జున , కృష్ణంరాజు సమాధానం చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.

‘ఏజెంట్లతో పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్న మంచు విష్ణు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts