విశాల్ తండ్రి కి దక్కిన అరుదైన గౌరవం..?

September 4, 2021 at 7:16 am

ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్నాడు విశాల్.ఇక విశాల్ తండ్రి కూడా ప్రముఖ నిర్మాత జీ.కే.రెడ్డి.ఇక ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఇక ఈయన చిరంజీవితో..S.P. పరశురామ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.తాజాగా విశాల్ తండ్రి ఫిట్ ఇండియా అంబాసిడర్గా ఎంపికవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అందులో వింతేమీ ఉందని అందరూ అనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయనకు 83 సంవత్సరాలలో ఫిట్ అందుకోవడం ఏమిటంటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.పోయిన సంవత్సరం.. జీ.కే.రెడ్డి.తో పాటలు ఈయన ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు.అయినా వీరు త్వరగానే కోలుకున్నారు.

Vishal's father GK Reddy impresses with his fitness routine | Tamil Movie  News - Times of India

ముఖ్యంగా విశాల్ తండ్రి 83 సంవత్సరం లో అంత త్వరగా కోలుకోవాలంటే చాలా కష్టం.ఇలా కరోనా నుంచి బయట పడడానికి వారికి ముఖ్యకారణం యోగాసనాలు వంటివి చేస్తూ ఉండడం,టెన్షన్లు అవి పెట్టుకోకుండా ఉండడం అని వారు చెప్పుకొచ్చారు.ఇక అంతే కాకుండా కొన్ని క్లిష్టమైన ఆసనాలను కూడా ఈయన వేసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు.ఈ వీడియో చూసిన ప్రేక్షకులు,తన కొడుకులకు ధీటుగా ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తూ.ఈ విషయంపై కూడా విశాల్ తన తండ్రికి కంగ్రాచులేషన్ చేయడం విశేషం.

విశాల్ తండ్రి కి దక్కిన అరుదైన గౌరవం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts