బన్నీకి 160 ఏళ్ల పురాతన పిస్టల్ ను బహుమతిగా ఇచ్చిన అభిమాని?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళ ఇండస్ట్రీలో కూడా అల్లుఅర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కేరళ లో అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ తెలుగు లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకు లేని క్రేజ్ కేరళలో అల్లు అర్జున్ కి ఉందనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఇండియన్ మూవీ ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం లోనే కాకుండా హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. అయితే తాజాగా యుఏఈ కి వెళ్ళిన అల్లు అర్జున్ కి అక్కడ ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా ఆయనకు ఒక మల్టీ మిలియనీర్ అత్యంత పురాతనమైన వస్తువుని బహుమానం గా ఇచ్చారు. అల్లు అర్జున్ కి ఎన్ని 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ కానుక చూసిన అల్లు అర్జున్ పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.