వార్ని.. ప్రేయసితో గడిపేందుకు ఒక్క రాత్రి పార్టీకి అన్నీ లక్షలు ఖర్చుపెట్టిన రణ్ బీర్?

బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ బీర్ కపూర్, అలియా భట్ గురించి మనందరికీ తెలిసిందే. వీరు గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇదే కాకుండా వీరు 2020లో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వినిపించాయి. కానీ కరోనా వల్ల ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది. అయితే సెప్టెంబర్ 28 రణ్ బీర్ కపూర్ పుట్టినరోజు నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ జంట ఒక రోజు ముందుగానే జోధ్ పూర్ లోని సుజన్ జువాయి క్యాంప్ కి చేరుకున్నారు.

అక్క విలాసవంతంగా గడపడమే కాకుండా స్థానికులతో ఎంజాయ్ చేసేలా ఏర్పాటు కూడా ఉంటాయి.అయితే రణ్ బీర్ కపూర్ తన ప్రేయసితో ఒక్కరాత్రి పార్టీ చేసుకునేందుకు ఆ రీట్రీట్ యాజమాన్యం 75 వేల నుంచి 1.65 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట.ప్రియుడి బర్త్ డే సందర్భంగా ఆలియా చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CUXaCn9sh1e/?utm_source=ig_web_copy_link

అలాగే వారు ఉన్న లొకేషన్ లో సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి హ్యాపీ బర్త్ డే మై లైఫ్ అనే క్యాప్షన్ నీ జోడించింది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినీ ప్రముఖులు అభిమానుల నుంచి 2 మిలియన్లకు పైగా లైకులు 17 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.