మంచు విష్ణుకు సపోర్టుగా.. తెలుగోడే ప్రెసిడెంట్ కావాలి అంటున్న నరేష్..!

మా మూవీ ఎలక్షన్ల పై ఇప్పుడు చాలా ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. మంచు విష్ణుకి సపోర్టుగా నరేష్ ఇలా మాట్లాడుతున్నాడు.మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసక బారుతున్న సమయంలో తన సంయుక్త కార్యదర్శిగా గెలిచానని అధ్యక్షత బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని చెప్పుకొచ్చాడు సీనియర్ హీరో నరేష్. ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ ఇలా తెలియజేస్తున్నాడు.

నరేష్ కృష్ణుడు అయితే.. మంచువిష్ణు విష్ణు రథం కాబట్టే నేను అతని తరుపున ఉన్నానని చెప్పుకొస్తున్నాడు. అందుచేతనే అతని మా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకునేంతవరకు పోరాడుతూ ఉంటానని నరేష్ తెలియజేశారు. హైదరాబాదులో నరేష్ విష్ణు, శివ బాలాజీ తదితరులతో మీడియాతో మాట్లాడుతూ అన్నారు

జయసుధ పోటీ చేస్తున్న సమయంలో దాసరి నారాయణరావు ఉపాధ్యక్షుడిగా చేయమన్నారని, ఆ తర్వాత సంయుక్త కార్యదర్శిగా చేయమన్నారని , తనకు స్థాయికి సంబంధం లేదని, ఏ పదవి వచ్చిన పోటీ చేస్తానని, చెప్పాను అన్నట్లుగా తెలియజేశాడు. కానీ ఆ సమయంలో జయసుధ ఒక్కరే ఓడిపోయారు. ఆ విషయం బాధ కలిగించిందన్నారు నరేష్. ఇక ఎవరు పడితే వారు మా అధ్యక్ష పదవి నిర్వహించడం కష్టమని. మంచు విష్ణు అయితే మనతోనే ఉంటాడు కాబట్టి అతనికి మద్దతు తెలియజేస్తున్నాను అన్నట్లుగా తెలియజేశాడు నరేష్. ఇక ప్రకాష్ రాజు కూడా మంచి స్నేహితుడు అన్నట్లుగా తెలియజేశాడు.