పవన్ కళ్యాణ్ మాటలు నేను ఏకీభవించను.. మంచు విష్ణు?

మా ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు అతని ఫ్యామిలీ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీ తో ఫిలింఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు.మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మా ఎన్నికలలో మా ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్లు వేసాము. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగుతాయి. మేము గెలుస్తాము అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాము.

నా వెనుక జగన్ గారు ఉన్నారు అని మీడియా రాస్తుంది. నాకు 900 మంది సభ్యుల మద్దతు ఉంది అని తెలిపారు.నా మ్యానిఫెస్టో చూసిన తరువాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాన్న గారు మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ కోసం మాట్లాడిన మాటలు నేను ఏకీభవించడం లేదు అని తెలిపారు మంచు విష్ణు. నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైపు ఉన్నాము. మరి ప్రకాష్ రాజు గారు ఎవరివైపు ఉన్నారో చెప్పమనండి అంటూ మంచు విష్ణు కామెంట్ చేశారు.