జీవిత పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్?

September 23, 2021 at 7:34 pm

మా ఎన్నికలలో మరొకసారి వివాదం చోటు చేసుకుంది. జీవిత రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని అంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. జీవిత రాజశేఖర్ తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతుందని అందువల్ల ఆమెపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్ కు పృథ్వీ రాజ్ లేఖ రాశారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

గతంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా మా ఎన్నికలు ప్రశాంతంగా సాగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆరోపణలు ప్రత్యారోపణలు ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపిస్తున్నాయి,అక్టోబర్‌ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం కొంచం గందరగోళం గా కనిపిస్తుంది.ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటాపోటీగా తలపడుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ని ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నారు.

జీవిత పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts