తన మొదటి లవ్ గురించి బయట పెట్టిన షణ్ముఖ్?

September 23, 2021 at 7:38 pm

ప్రతి ఒక్కరు తమ జీవితంలో తొలి ప్రేమ గురించి ఎప్పటికి మర్చిపోలేరు.ఆ ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఆ మొదటి ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండి పోతాయి. అలాంటి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తు చేసుకున్న కూడా ఏదో తెలియని ఫీల్ వస్తుంది.కొందరు అయితే అలా వారి తొలి ప్రేమ ను తలుచు కొని బాధపడుతుంటారు, మరి కొందరు సంతోష పడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు కూడా వారి తొలి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. ఈ క్రమంలో సింగర్‌ శ్రీరామచంద్ర తన ఫస్ట్‌ లవ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు ఇదివరకే పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారన్నాడు. దీప్తి సునయన కంటే ముందే తను ఒకరిని ప్రేమించానని ఓ సీక్రెట్‌ బయటపెట్టాడు షణ్ముఖ్‌.

దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ లవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరిపై ఇప్పటికే ఎన్నో రకాల ప్రచారాలు రూమర్స్ వచ్చాయి. ఇక తాజాగా బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ జస్వంత్ తన మొదటి లవ్ గురించి చెప్పుకొచ్చాడు. దీప్తి సునైనా కంటే ముందుగా తాను ఒక అమ్మాయిని ప్రేమించినట్టు గా తెలిపాడు.తనలో అన్నిరకాల ఎమోషన్స్‌ ఉన్నాయని తెలిసింది తన ఫస్ట్‌ లవ్‌ వల్లేనంది శ్వేతవర్మ. ఇక ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్‌ తన ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్తూ నేను ప్రేమించిన అబ్బాయి బండి వెళ్లిపోతుంటే ఆ బండి వెనక పరిగెత్తుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది.

తన మొదటి లవ్ గురించి బయట పెట్టిన షణ్ముఖ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts