మహేష్ శంకర్ సినిమాకు నో చెప్పడానికి అసలు కారణం అదే?

September 23, 2021 at 7:42 pm

తమిళ దర్శకుడు శంకర్ కు ఒకప్పుడు ఉన్నప్పుడు క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పవచ్చు. గత కొన్నేళ్లలో దర్శకుడు శంకర్ వాహ తగ్గిన మాట వాస్తవమే. రోబో సినిమా తో ఆయన ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఆ సమయంలో దర్శకుడు శంకర్ తో కలిసి పని చేయడానికి ఇండియాలోని సూపర్ స్టార్లు అందరూ కూడా ఆసక్తి చూపించారు. ఇలాంటి సందర్భంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు శంకర్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పటికే మహేష్ దూకుడు సినిమా చేస్తుండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడట. శంకర్ మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతా సిద్ధమయ్యాక మహేష్ ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారు.

ఇక ఇదే విషయాన్ని మహేష్ తో శ్రీనువైట్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. దూకుడు సినిమా మొదలయ్యేటప్పటికి శంకర్ తో మహేష్ కమిట్మెంట్ ఉందని.. ఈ సినిమా షూటింగ్ మధ్య దశలో ఉండగా శంకర్ సినిమాకు మహేష్ నో చెప్పినట్లు శ్రీను వైట్ల తెలిపారు. త్రీ ఇడియట్స్ మూవీని తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేయడానికి సిద్ధమైన శంకర్, అదే సినిమాను తెలుగులో మహేష్ బాబు చేయాలనుకుంటున్నట్లు శ్రీను వైట్ల తెలిపారు. అయితే దూకుడు సినిమాలో ఒక కీలక సన్నివేశం రాసి ఆ సీన్ తో పాటు డైలాగులు మహేష్ బాబు కు వినిపించగా అతను ఫ్లాట్ అయ్యి నమ్రత కి ఫోన్ చేసి తనకు ఈ సినిమా చాలా ముఖ్యమని దీని మీదే పూర్తిగా పోస్ట్ పెట్టాలనుకుంటున్నాను అని అందువల్లే శంకర్ సినిమాకు నో చెప్పాడని శ్రీను వైట్ల తెలిపారు.

మహేష్ శంకర్ సినిమాకు నో చెప్పడానికి అసలు కారణం అదే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts