చిరంజీవి సినిమాలో నటించక పోవడానికి కారణం చెప్పిన సాయి పల్లవి..?

September 23, 2021 at 7:25 am

ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాని రేపు థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లలో బాగా జోరుగా పాల్గొన్నారు.ఈ సినిమాకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన కూడా తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ కోసం కొన్ని ఇంటర్వ్యూ లలో పాల్గొనడం జరిగింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొంత మంది స్టార్ సెలబ్రెటీలు కూడా రావడం జరిగింది.

సాయి పల్లవి కూడా లవ్ స్టోరీ సినిమా గురించి కొన్ని విషయాలను మీడియా ద్వారా తెలియజేసింది. తన రాబోయే రోజుల్లో ఎటువంటి సినిమాలను కూడా తెలియజేసింది. ఇక చిరంజీవితో నటించక పోవడానికి కారణం ఆమె స్వయంగా తెలియజేసింది.

ఇదే నేపథ్యంలో సాయి పల్లవి మాట్లాడుతూ రీమేక్ చిత్రాలకు నేను వ్యతిరేకం కాను. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయినప్పుడు మరొక భాష ప్రేక్షకులకు చూపించాలని రీమేక్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఏదైనా రీమేక్ సినిమాలలో ఒకరు చేసిన పాత్ర మరొకరు చేయాలంటే కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ పాత్ర కంటే బెటర్ చేయాలని ఒత్తిడి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందుచేతనే నేను రీమిక్ పాత్రలకు కొంచెం దూరంగా ఉంటానని తెలియజేసింది.

ఇక అందుచేతనే చిరంజీవి నటిస్తున్న లూసీఫర్ సినిమా ని రిజెక్ట్ చేశాను అని చెప్పకనే చెప్పింది.

 చిరంజీవి సినిమాలో నటించక పోవడానికి కారణం చెప్పిన సాయి పల్లవి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts