ఆలియా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా?

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలు హీరో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఆలియా భట్ సౌత్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమాకి ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు ప్రారంభోత్సవానికి అక్టోబర్ లో జరుగుతుందని, తరువాత నవంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఇందులోజూనియర్ ఎన్టీఆర్ సరసన నటించడానికి హీరోయిన్ పాత్ర కోసం పూజ హెగ్డే, రష్మిక మందన, కియారా అద్వానీ వెళ్లి వినిపించగా, తాజాగా ఆలియా భట్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇంతకు ముందు ఆలియా తనకు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానని పలు సందర్భాలలో తెలిపింది. ఇక ఆలియా అనుకున్న విధంగా..ఆమె చెప్పినదే జరుగుతుందా? లేదా అంటే వేచి చూడాల్సిందే మరి.