నివేదా థామస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాని హీరోగా తెరకెక్కిన `జెంటిల్ మేన్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. నిన్ను కోరి, జై లవకుశ వంటి చిత్రాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాసల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ.. ఏ హీరోయిన్నూ చేయని పని చేసి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగిందంట.. నివేదా తాజాగా పాలు పితికింది. అవుల ఫామ్ వద్దకు వెళ్లిన ఈ భామ స్వయంగా పాలు పితుకి.. ఆ పాలతో చక్కటి కాఫీని తయారు చేసుకుంది.
ఇక ఈ తతంగాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాధారణంగా కొంతమంది హీరోయిన్లు ఆవు దగ్గరకు వెళ్ళడానికే భయపడుతుంటారు.. ఒకవేళ వెళ్లినా పాలు పితికే సాహసం చేయనే చేయరు, ఇప్పటి వరకు చేయలేదు. కానీ, నివేదా మాత్రం ఏటువంటి బెరుకు లేకుండా పాలు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈమె వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో..ఆమెపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.