ప‌వ‌న్ పార్టీపై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..జన సైనికులు ఫైర్‌!

September 8, 2021 at 10:05 am

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయ‌న నిర్మాతగానూ టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్నారు. అయితే ఎప్పుడూ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే బండ్ల‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ప‌ర‌మ భ‌క్తుడు. స్టేజ్ ఎక్కితే చాలు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసే బండ్ల‌.. తాజాగా ఆయ‌న పార్టీ ఆయిన జ‌న‌సేన‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

TDP says it got tricked by Jana Sena chief Pawan Kalyan

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బండ్ల‌..తెలంగాణాలో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించాడు. ఆయ‌న మాట్లాడుతూ..ఏపీలో జ‌న‌సేన స్ట్రాంగ్‌గా ఉంది. కానీ, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌న్న బెంజికార్లు, ఆడికార్లు ఉన్న‌ప్పుడు మారుతి 800 న‌డ‌ప‌మంటే ఎలా న‌డుపుతాం. వాస్త‌వాలు మాట్లాడుకుంటే తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌కంటే జ‌న‌సేన ప్ర‌భావం చాలా త‌క్కువ‌గా ఉంది.

Power Star allocates 30 days to this producer - The Leo News | English News

అలాంటి పార్టీని భుజాన వేసుకుని మోయ‌గ‌లిగే శ‌క్తి, సామ‌ర్థ్యం నాకు లేదు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముఖ్య‌మంత్రి కావాల‌ను కోరుకునే వాళ్ల‌లో నేను ఒక‌డిని.` అంటూ వ్యాఖ్యానించారు. అయితే బండ్ల చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. పబ్లిక్ గా పార్టీని ఎండ‌గ‌ట్ట‌డం స‌రికాదంటూ ఆయ‌నపై జ‌న సైనికులు ఫైర్ అవుతున్నారు.

ప‌వ‌న్ పార్టీపై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..జన సైనికులు ఫైర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts