టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్ లో నటించింది వీళ్ళే!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాలలో ఒక స్టార్ హీరో మరొక కథానాయకుడితో నటించడానికి సైతం సై అంటున్నారు. అంతేకాకుండా అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్ నటించిన స్టార్ హీరో లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆచార్య సినిమాతో తండ్రీకొడుకులు ఆయన రామ్ చరణ్, చిరంజీవి మొదటిసారిగా పూర్తిస్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అలాగే వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ సినిమాలో వీరిద్దరూ కూడా రియల్ లైఫ్ మామ అల్లుళ్ళ లాగా నటించడం విశేషం. వీరిద్దరూ అంతకుముందు ప్రేమమ్ సినిమాలో కూడా నటించారు.

వెంకటేష్, రానా ఇద్దరు కలిసి బాబాయి అబ్బాయిలు కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాకు వెంకీ బాబాయి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వీరిద్దరూ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని సమాచారం. జీవితంలో తండ్రి కొడుకులు అయినా నాగ చైతన్య,నాగార్జున ప్రేమమ్ సినిమా లో నటించడం విశేషం. అలాగే నాగ తేజ నా జీవిత భాగస్వామి అయిన సమంతతో కలిసి మజిలీ సినిమాలో నటించారు. అలాగే నిజజీవితంలో తండ్రీకొడుకులు అయినా ఏ ఎన్ ఆర్, నాగార్జున కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే ఇలాంటి సినిమాలలో కలిసి నటించారు. అలాగే మనం సినిమాలో నాగార్జున నాగచైతన్య ఇద్దరూ తండ్రి కొడుకు పాత్రలో నటించారు.

ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ ముగ్గురు కలసి తాతమ్మకల సినిమాలో తండ్రీకొడుకులుగా నటించారు. బాలకృష్ణ అలా అన్న కుమారుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. నిజజీవితంలో తండ్రి కొడుకులు అయిన సూపర్ స్టార్ కృష్ణ అలాగే మహేష్ బాబు శంఖారావం, కొడుకు దిద్దిన కాపురం, రాజకుమారుడు లాంటి సినిమాలో తండ్రి కొడుకులు గా నటించారు. కృష్ణ కూడా తన భార్య విజయనిర్మల తో కలిసి నటించారు. ప్రభాస్ అలాగే కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్ చిత్రాల్లో కలిసి నటించారు.ఇలా ఎంతో మంది సెలబ్రేటీలు వారి ఫ్యామిలీతో కలిసి సినిమాల్లో నటించారు.