సినిమాల కోసం పేరు మార్చుకున్న టాప్ హీరోయిన్లు వీరే!

సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టామంటే లేఫ్ స్టైల్ ఒక్క‌టే కాదు.. పేర్లు కూడా మారిపోతాయి. ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌నో, ల‌క్ కోస‌మో లేదా ఇతరిత‌ర కార‌ణాల వ‌ల్ల పేరును మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న మ‌న టాప్ హీరోయిన్ల‌పై ఓ లుక్కేసేద్దాం రండి మ‌రి..

Buy krithi shetty dresses online - In stock

కృతి శెట్టి: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అందుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ. అసలు పేరు.. అద్వైత.

Is this how much Nayanthara is charging for a film?

న‌య‌న‌తార‌: చంద్రముఖి సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న న‌య‌న్‌..కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌లో అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల‌కూ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ఈమె అసలు పేరు డయానా మరియమ్‌ కురియన్‌.

Kiara Advani: There is a long way to go before I reach where I want to be | Hindi Movie News - Times of India

కియారా అద్వానీ: భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న కియారా.. రియ‌ల్ నేమ్ అలియా. ప్ర‌స్తుతం ఈ భామ బాలీవుడ్‌లో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Snehal Ullal, Bhoomika Chawla, Koena Mitra and other actresses who had a dhamaka debut but have now disappeared from Bollywood - view pics

భూమిక: యువకుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చిన భూమిక‌.. అస‌లు పేరు రచనా చావ్లా. సినిమాల కోసం పేరు మార్చుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన సంగ‌తి తెలిసిందే.

Anushka Shetty comments on casting couch in the Telugu film industry | Telugu Movie News - Times of India

అనుష్క‌: పూరీ జ‌గన్నాథ్‌, నాగార్జున కాంబోలో తెర‌కెక్కిన సూప‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుష్క‌ అసలు పేరు స్వీటి శెట్టి. ఈమె పేరు మార్చిందో ఎవ‌రో కాదు త‌న మొద‌టి డైరెక్ట‌ర్‌ పూరీ జ‌గ‌న్నాథే.

Anjali: మరో గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన అంజలి.. ఈసారైనా ఇక్కడ నిలదొక్కుకుంటుందా...? | Anjali to join f3 shooting this week | TV9 Telugu

అంజలి: తెలుగ‌మ్మాయి అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళ ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ త‌ర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన‌ అంజ‌లి అస‌లు పేరు బాలాత్రిపుర సుందరి.

Sridevi: A woman who lived, loved, and acted on her own terms

శ్రీ‌దేవి: అల‌నాటి అందాల తార‌, దివంగ‌త న‌టి, బ‌డా నిర్మాత బోణీ క‌పూర్ భార్య‌ శ్రీ‌దేవి రియ‌ల్ నేమ్ శ్రీఅమ్మ అయ్యంగర్ అయ్యప్పన్‌. తమిళనాడులో పుట్టి ముంబయిలో సెటిల్‌ అయ్యింది.