తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇంట‌ తీవ్ర విషాదం!

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది త‌మిళ‌పై తల్లి కృష్ణ కుమారి(77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ஏன் அப்படி சொன்னே.. அப்படி சொல்ல கூடாதும்மா.. வற்புறுத்திய தாய்.. பூரிக்க  வைத்த மகள் தமிழிசை | Tamilisai Soundarajan gets wishes from her Mother -  Tamil Oneindia

ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని సాలిగ్రామానికి తరలించ‌నున్నారు. అక్క‌డే అంత్య‌క్రియులు జ‌ర‌గ‌నున్నాయి. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద కూతురు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం.. ప్రముఖుల సంతాపం.. |  Telangana Governor Tamilasai Soundarrajan Mother krishnakumari Passes Away  | TV9 Telugu

కాగా, తమిళిసై తల్లి కృష్ణకుమారి మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమిళిసై కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మ‌రోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి హరీశ్‌రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

 

Share post:

Popular