ఎస్కెలేటర్‌పై సోనూసూద్‌ విన్యాసాలు..మ‌తిపోగొట్టేశాడుగా!!

సోనూసూద్.. ఈయ‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. న‌టుడుగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. అందుకు కార‌ణం ఆయ‌న సేవాకార్య‌క్ర‌మ‌లే. తెలిసి వారు, తెలియని వారు అనే తేడా లేకుండా సాయం చేయ‌మ‌ని కోరిన ప్ర‌తి ఒక్క‌రికి త‌న అభ‌య‌హ‌స్తాన్ని అందించి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.

ఇప్ప‌టికీ ఆయ‌న సేవాకార్య‌క్ర‌మాల‌ను ఆప‌లేదు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ త‌న‌లో మ‌రో కొత్త టాలెంట్‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేశారు.

తాజాగా విమానాశ్రయంలో ఎస్కలేటర్ మీద పై నుండి కిందకి వస్తున్న సోనూసూద్ మెట్ల మీద అడుగులు తీసి గాల్లో ఎగురుతున్నట్లుగా కిందవరకూ వచ్చాడు. దీన్ని ముందున్న వ్యక్తి వీడియో తీయ‌గా.. ఆ వీడియోను స్వ‌యంగా సోనూ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అంద‌రితో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం మ‌తిపోగొడుతున్న ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజ‌న్లు.. సోనూసూద్ విన్యాసాల‌కు ఫిదా అవుతూ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/SonuSood/status/1430833801010110466?s=20